![](https://d37e65yvvsthcl.cloudfront.net/wp-content/uploads/2024/07/Amitabh-Bachchan-Work-so-Hard-for-Ashwatthama-Role-in-Kalki-2898-AD-2.jpg)
కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా కోసం ప్రభాస్ (Prabhas) ఎంత కష్టపడ్డారో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ కల్కి మూవీ సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. 81 సంవత్సరాల వయస్సులో అమితాబ్ బచ్చన్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లలో నటించగా ఆయనకు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సినిమా ఏదైనా పాత్ర ఎంత క్లిష్టమైనా అమితాబ్ నటించారంటే ఆయన తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు.
బ్రహ్మాస్త్ర అయినా కల్కి అయినా అమితాబ్ నటనకు ఎవరూ వంక పెట్టలేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేలా కల్కి 2898 ఏడీ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు. అయితే ఈ పాత్రలో నటించడం కోసం అమితాబ్ బచ్చన్ ఎంతో కష్టపడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అశ్వత్థామ పాత్ర క్యాస్టూమ్స్ హెవీ క్యాస్టూమ్స్ కాగా ఆయన మేకప్ కు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని తెలుస్తోంది.
3 గంటల పాటు సహనంగా కూర్చుని మేకప్ వేసుకుని అమితాబ్ ఈ సినిమాలో నటించారు. అమితాబ్ కల్కి సినిమా కోసం 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. కల్కి సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా ఏ రేంజ్ లో రాబోయే రోజుల్లో సంచలనాలు సృష్టించనుందో చూడాల్సి ఉంది.
కల్కి 2898 ఏడీ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తైందని సమాచారం అందుతోంది. ప్రభాస్ డేట్స్ కేటాయిస్తే కల్కి సీక్వెల్ షూటింగ్ వేగంగా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కల్కి 2898 ఏడీ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని భారీ సినిమాల దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది.